Bengaluru : సాప్ట్‌వేర్ ఉద్యోగి కాదు.. ఆటో డ్రైవర్! స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్.. ఆశ్చర్య‌పోతున్న నెటీజన్లు

బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు.

Bengaluru : సాప్ట్‌వేర్ ఉద్యోగి కాదు.. ఆటో డ్రైవర్! స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్.. ఆశ్చర్య‌పోతున్న నెటీజన్లు

Bengaluru auto driver

Updated On : August 16, 2023 / 3:12 PM IST

Bengaluru Auto Driver  : దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. అన్ని వర్గాల ప్రజలు బెంగళూరులో టెక్నాలజీ‌పరంగా నిత్యం అప్‌డేట్ అవుతూ ఉంటారు. నగరంలో వీధులన్నీ సందడిగా కనిపిస్తాయి. కొత్త‌కొత్త ఆవిష్కరణలకు ఈ నగరం నిలయంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు తన గమ్య స్థానానికి చేరాడు. డ్రైవర్‌కు డబ్బులు చెల్లించేందుకు ‘నమ్మయాత్రి’ సేవను ఎంచుకున్నాడు. అయితే, బార్‌కోడ్ స్కాన్ చేయడానికి ప్రయత్నించగా.. డ్రైవర్ ఒక్కసారిగా తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ చూపించారు. అదిచూసిన ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు.

Baboons Attack: మాతోనే పెట్టుకుంటావా? చిరుత పులిని తరిమితరిమి కొట్టిన బబూన్ కోతులు.. వీడియో వైరల్

బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ (QR Code Payments) ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టిట్లో వైరల్‌గా మారింది. ఇక్కడ ఆటో డ్రైవర్ తెలివిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోకు సంబంధించిన ట్వీట్‌ను లక్షకుపైగా మంది నెటిజన్లు వీక్షించారు. ఫొటోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఓ నెటిజన్.. అతను ఆటో రాజాకాదు.. అతను తెలివైనవాడు అని పేర్కొన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటన బెంగళూరులో మాత్రమే కనిపిస్తుంది అనుకుంట అని వ్రాశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. బెంగళూరులోని ఆటో డ్రైవర్లు బెంగళూరులోని ఐటీ ఉద్యోగులకంటే స్మార్ట్ గా తయారయ్యారంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

ట్విటర్‌లో ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి ఇలా చెప్పాడు.. ఈరోజు నేను ఆటోలో ప్రయాణించాను. ఆటో డ్రైవర్‌కు చెల్లింపులు చేసే సమయంలో క్యూర్ కోడ్‌ను అడిగాను. ఆ ఆటో డ్రైవర్ తనచేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ని చూపించాడు. దానికి క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్ సేవర్ గా సేవ్ చేసుకున్నాడని గుర్తించి ఆశ్చర్యపోయాను అని తెలిపాడు.