Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్

స్వాతంత్ర్య భారతదేశంలో అహింసాయుతమైన పోరాటంలో పాడుకున్న జాతీయ గేయం వందేమాతరం. దీనిని బంకించంద్ర ఛటర్జీ రచించారు. 1938 జూన్ 27న పుట్టిన ఛటర్జీ 84వ జయంతి సందర్భంగా ఆ జాతీయ గేయానికి తెలుగు అర్థాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్

Vanemataram

Updated On : June 27, 2022 / 10:07 PM IST

Vandemataram: స్వాతంత్ర్య భారతదేశంలో అహింసాయుతమైన పోరాటంలో పాడుకున్న జాతీయ గేయం వందేమాతరం. దీనిని బంకించంద్ర ఛటర్జీ రచించారు. 1938 జూన్ 27న పుట్టిన ఛటర్జీ 84వ జయంతి సందర్భంగా ఆ జాతీయ గేయానికి తెలుగు అర్థాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

వాడుకలో ఉన్న గేయం కాకుండా పూర్తి గేయం ఇదే.

వందేమాతరం
వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం

Read Also: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”

అర్థం:
తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనము గలిగి సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను.