Banking Rates: జూన్ నెల నుంచి బ్యాంక్ వడ్డీ రేట్లలో కీలకమార్పులు

బ్యాంకింగ్‌ రంగంలో బుధవారం నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. ఎస్బీఐ కల్పించే హోం లోన్‌ వడ్డీ పెంపు జరగనుంది. గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన ఎస్బీఐ జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. గృహ రుణాలపై 7.05% వడ్డీని వసూలు చేయనుంది ఎస్బీఐ

Banking Rates: జూన్ నెల నుంచి బ్యాంక్ వడ్డీ రేట్లలో కీలకమార్పులు

Interest Rates

Updated On : May 30, 2022 / 8:28 AM IST

Banking Rates: బ్యాంకింగ్‌ రంగంలో బుధవారం నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. ఎస్బీఐ కల్పించే హోం లోన్‌ వడ్డీ పెంపు జరగనుంది. గృహ రుణాలకు వడ్డీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన ఎస్బీఐ జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. గృహ రుణాలపై 7.05% వడ్డీని వసూలు చేయనుంది ఎస్బీఐ.

దీంతో పాటుగా మోటరు ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని కూడా పెంచారు. జూన్‌ 1 నుంచి థర్డ్‌ పార్టీ మోటారు ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు పెంచనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వాహనాలను బట్టి వాటి రేట్లలో మార్పులు ఉంటాయని వెల్లడించింది.

Read Also : SBI FD వడ్డీ రేట్లు పెరిగాయి.. కొత్త రేట్లు ఇవే..!

ఆధార్‌ సాయంతో నగదు చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్‌) సేవలకు చార్జీలు వసూలు చేస్తామని ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ఇప్పటికే కన్ఫామ్ చేసింది. వీటిని కూడా జూన్‌ నెలలోనే అంటే 15 నుంచి అమల్లోకి తేనున్నారు. మొదటి మూడు లావాదేవీలు ఉచితంగానే కల్పించినా.. తర్వాతి ప్రతి లావాదేవిపై రూ.20+జీఎస్టీ వసూలు చేస్తారు. ఇక మినీ స్టేట్‌మెంట్‌ చూడాలనుకునే వారికి రూ.5+జీఎస్టీ తప్పదన్నమాటే.