Banks వార్నింగ్: అకౌంట్లో డబ్బులు పోతే.. సంబంధం లేదు!

మీరు ఈ బ్యాంకు ఖాతాదారులా? అయితే జాగ్రత్త.. మీ అకౌంట్ల ో డబ్బులు పోతే తమకు సంబంధం లేదంటోంది ఎస్బీఐ బ్యాంకు. ఈ విషయంలో తమ కస్టమర్లను ఎస్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దని గట్టిగా హెచ్చరిస్తోంది. లేకపోతే మీ అకౌంట్లో నగదు కోల్పోవాల్సి వస్తుందని అంటోంది. ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ఇలా తన కస్టమర్లకు వార్నింగ్ ఇస్తుందంటే.. బ్యాంకు ఖాతాదారులు తెలిసో తెలియకో తమ బ్యాంకు అకౌంట్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంట.
ఆ విషయం బ్యాంకు దృష్టికి రావడంతో పై విధంగా పేర్కొంది. ఇలాంటి తప్పులు చేయొద్దని ముందు జాగ్రత్త చర్యగా ఎస్బీఐ తన ఖాతాదారులకు అలర్ట్ చేస్తోంది. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సంబంధిత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేయరాదంటూ ట్విట్టర్ వేదికగా అప్రమత్తం చేస్తోంది. పొరపాటున లేదా స్నేహితులకు, కుటుంబ సభ్యులు అడిగారని, బ్యాంకులో డబ్బులు వేయాలనే ఉద్దేశంతో అకౌంట్ వివరాలను షేర్ చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్లు మీ అకౌంట్ వివరాలను తస్కరించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఒకవేళ సోషల్ మీడియాలో బ్యాంకు వివరాలు షేర్ చేస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా మీ అకౌంట్ నుంచి తెలియకుండా నగదు లావాదేవీలు జరిగితే మాత్రం బ్యాంకులకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏ బ్యాంకు అధికారి తమ కస్టమర్లకు ఫోన్ కాల్ చేసి పర్సనల్ వివరాలు అడగరు. అంతేకాదు.. ఎలాంటి అనుమానాస్పద లింకులను పంపరు. VPA, UPI వివరాలతో పాటు User ID, PIN, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డు, ఇక CVV నెంబర్, OTP చెప్పమని అసలే అడగరు. ఫోన్ కాల్, SMS లేదా Email ద్వారా బ్యాంకు అధికారులు పంపరు’ అని SBI తెలిపింది.