Banks : నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ముందే పని పూర్తి చేసుకోండి
Bank Holidays
Bank Holidays : బ్యాంకులో ఏదైనా పని ఉందా ? లావాదేవీలు జరుపుతుంటారా ? అయితే ఆ పనులు ముందే ముగించుకోండి. ఎందుకంటే నాలుగు రోజులు సెలవులు వచ్చాయి బ్యాంకులకు. రాష్ట్రాల వారీగా ఈ బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే.. మరో రాష్ట్రంలో సెలవు ఉండకపోవచ్చు. 2021, జూన్ 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య నాలుగు రోజుల సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో రెండు పండుగలున్నాయి.
– 2021, జూన్ 25వ తేదీ శుక్రవారం – గురు హర్గోవింద్ జయంతి. జమ్మూ కశ్మీర్ వాసులు సెలబ్రేట్ చేసుకుంటారు.
– జూన్ 26వ తేదీ శనివారం – నాలుగో శనివారం
– జూన్ 27వ తేదీ ఆదివారం – ఆదివారం ఎలాగూ సెలవు.
– జూన్ 30వ తేదీ బుధవారం – రేమ్నాని..ఇజ్వాల్లో బ్యాంకులు పని చేయవు.
– ఖాతాదారులు మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులతో పాటు వివిధ రకాల ఆన్లైన్ మోడ్లలో లావాదేవీలు జరుపుకోవచ్చు.