Gandhi Ji Death Anniversary: ఒక హిందుత్వవాది గాంధీజీని కాల్చిచంపాడు -రాహుల్ గాంధీ
దేశమంతా ఇవాళ(30 జనవరి 2022) జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతిని నిర్వహిస్తోంది.

'Bapu still alive': Rahul Gandhi
Gandhi Ji Death Anniversary: దేశమంతా ఇవాళ(30 జనవరి 2022) జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతిని నిర్వహిస్తోంది. దేశాన్ని సత్యం, అహింసా మార్గంలో నడిపించిన స్వాతంత్ర్య సమరయోధుడు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతిగా నేటి రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1948లో ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపారు.
దేశప్రజలు ఈ ప్రత్యేక దినాన్ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడానికి కూడా ఇదే కారణం. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని గాంధీజీని స్మరించుకుంటూ రాజ్‌ఘాట్‌లోని నివాళులర్పించారు. బాపు వర్ధంతి సందర్భంగా దేశ నాయకులంతా ఆయనను స్మరించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కూడా ట్వీట్ ద్వారా జాతిపితకు నివాళులర్పించారు. తన ట్వీట్‌లో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “గాంధీజీని ఒక హిందుత్వవాది కాల్చిచంపాడు. గాంధీజీ ఇకలేరని హిందుత్వవాదులందరూ భావిస్తున్నారు. ఎక్కడ నిజం ఉంటుందో అక్కడ బాపు బతికే ఉన్నాడు!” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు.
మహాత్మాగాంధీ 13 జనవరి 1948న హిందూ-ముస్లిం ఐక్యతను కాపాడేందుకు మతపరమైన ఉన్మాదానికి వ్యతిరేకంగా కలకత్తాలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. జనవరి 18, 1948న తన నిరాహార దీక్షను ముగించిన సరిగ్గా 11 రోజుల తర్వాత 30 జనవరి 1948న హత్యకు గురయ్యారు.