Beer Prices to Rise: మందు బాబులకు షాక్.. పెరగనున్న బీర్ల ధరలు!

మందు బాబులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి తయారీ కంపెనీలు. మరీ ముఖ్యంగా దంచి కొడుతున్న ఎండలకు చల్లని బీర్ తాగి ఛిల్ల్ అవ్వాలని అనుకొనే బీర్ ప్రియులకు షాక్ కొట్టేలా..

Beer Prices to Rise: మందు బాబులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి తయారీ కంపెనీలు. మరీ ముఖ్యంగా దంచి కొడుతున్న ఎండలకు చల్లని బీర్ తాగి ఛిల్ల్ అవ్వాలని అనుకొనే బీర్ ప్రియులకు షాక్ కొట్టేలా తయారీ కంపెనీలు ధరలు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. బీరు తయారీకి ఉపయోగించే బార్లీ సహా మిగతా ముడిపదార్ధాలు అన్నీ ధరలు పెరగడంతో బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు యోచిస్తున్నాయి.

Beer Sales : మండుతున్న ఎండలు.. టాప్ లేపుతున్న బీర్ సేల్స్!

గడిచిన ఏడాదిలోనే బార్లీ ధర 65%, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. దీంతో బీర్ల ధరలను కూడా 10 నుండి 15 శాతం ధర పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీర్ తయారీకి బార్లీ, ర్లీమాల్ట్ అనేవి ముడి పదార్థాలు. బార్లీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉండగా.. ఇక ఉక్రెయిన్ రీ మాల్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో నాల్గవల్గ స్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న కారణంగా ఆ రెండు ముడి పదార్ధాల ధరలకు రెక్కలొచ్చాయి.

Beer : వేసవిలో చల్లదనం కోసం బీరు తాగటం మంచిదా?

మనదేశంలోనూ బార్లీ పండుతోంది. చాలా వరకు బ్రూవరీ కంపెనీలు దేశీయ బార్లీతోర్లీనే బీర్లను తయారు చేస్తున్నాయి. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో బార్లీ ధరలు అమాంతం పెరగడంతో ఇక్కడ, దేశీ మార్కెట్లో కూడా ధరలు పెంచేశారు. దాంతో బీర్ల తయారీ కంపెనీలకు తయారీ వ్యయాలు అధికమవుతున్నాయని.. ఫలితంగా ఈ భారాన్నంతా బీరును లొట్టలేట్ట సుకుంటూతాగే వారి నెత్తినే వేసేందుకు బీర్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు