Beer Sales : మండుతున్న ఎండలు.. టాప్ లేపుతున్న బీర్ సేల్స్!

గ్రేటర్ హైదరాబాద్ లో బీర్ల కోసం ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని వైన్స్ షాప్స్ లలో చల్లటి బీర్లు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారంట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా బీర్లు సేల్స్...

Beer Sales : మండుతున్న ఎండలు.. టాప్ లేపుతున్న బీర్ సేల్స్!

Beers

Summer Season Beer Sales : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో ప్రజలు కొంత సేద తీరారు. మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భగభగమండిస్తున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. బయటకు వచ్చినా.. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. కూల్ డ్రింక్స్, జ్యూస్ లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే.. మందుబాబులు వైన్స్ షాప్స్ ల ఎదుట క్యూ కట్టేస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లటి ‘బీర్లు’ కోసం ఎగబడుతున్నారు.

Read More : బీర్లు తాగాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌బ్లిక్

గ్రేటర్ హైదరాబాద్ లో బీర్ల కోసం ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని వైన్స్ షాప్స్ లలో చల్లటి బీర్లు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారంట. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా బీర్లు సేల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో మార్చి, ఏప్రిల్ నెలలో 21,68,537 కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు అంచనా. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.

Read More : Beer : వేసవిలో చల్లదనం కోసం బీరు తాగటం మంచిదా?

ఎండల కారణంగా ఇంత మద్యం బ్రాండ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 2.7 లక్షల కేసులకు పైగా మద్యం విక్రయాలు జరిగితే.. ఏప్రిల్ నెలలో 1.85 లక్షల కేసులు మాత్రమే అమ్మడుపోయాయి. రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు 4.33 లక్షల కేసులు, ఏప్రిల్ నెలలో 3.97 లక్షల కేసులకు తగ్గాయి. ఆదాయంలో కూడా తేడా వచ్చింది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్ ల అమ్మకాలపై రూ. 389 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెలలో ఇప్పటి వరకు రూ. 398.32 కోట్ల మద్యం అమ్మకాల ద్వారా వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయాలు తగ్గినా.. బీర్ల అమ్మకాలు టాప్ లేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19.30 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగితే.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32.72 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు అంచనా. మే నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో ఈ నెలలో కూడా బీర్ల అమ్మకాలు మరింత జోరు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.