Bengal Tiger: 20 ఏళ్లలో 70 పులులను చంపాడు

70 పులులను చంపిన వేటగాడు హబీబ్ తాల్కూదార్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 20 ఏళ్లలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సుందర్బన్ అడవుల్లో బెంగాల్ టైగర్స్ ను చెప్పేవాడు.

Bengal Tiger: 20 ఏళ్లలో 70 పులులను చంపాడు

Bengal Tiger

Updated On : June 1, 2021 / 5:32 PM IST

Bengal Tiger: 70 పులులను చంపిన వేటగాడు హబీబ్ తాల్కూదార్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గత 20 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సుందర్బన్ అడవుల్లో బెంగాల్ టైగర్స్ ను చంపుతున్నాడు హబీబ్. ఇతడిని పట్టుకునేందుకు 20 ఏళ్లుగా అటవీశాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అడవుల్లో తిరుగుతూ.. గూడేలలో నివసిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.

సోమవారం సుందర్బన్ సమీపంలో ఉన్న మాధ్యా సోనాటోలా గ్రామంలో అతన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా హబీబ్ తాల్కూదార్‌ పై గతంలో మూడు సార్లు అరెస్టు వారెంట్ జారీ చేశారు. చాలాకాలంగా పరారీలో ఉండటంతో పట్టుకోవడం సాధ్యం కాలేదు. పోలీసులు జరిపిన విచారణలో సుమారు 70 పులులను చంపినట్లు హబీబ్ ఒప్పుకున్నారని షారంకోలా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జోయల్ అబెదిన్ తెలిపారు. కాగా హబీబ్ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా హబీబ్ పులులను చంపి వాటి చర్మాన్ని అమ్మేవాడు.

సుందర్బన్ అడవుల్లో మనుషులు వెళ్లేందుకు అనుమతి లేకపోయిన ఆగ్రామమార్గంలో వెళ్లి వాటిని హత్య చేశాడని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుందర్బన్ అడవుల్లో ప్రస్తుతం రాయల్ బెంగాల్స్ టైగర్స్ 114 ఉన్నాయి.