Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు

బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.

Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు

Monkeypox Spreads To 14 Countries; Compulsory Quarantine In Belgium (1)

Updated On : May 24, 2022 / 5:14 PM IST

Monkeypox Treatment: బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఇవేకాకుండా, దేశంలో కొవిడ్-19 కేసులు 11వేల నుంచి 15వేల వరకూ పెరిగినట్లు బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ రంగప్ప వెల్లడించారు.

దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నందున, వ్యాధి లక్షణాలు, వ్యాధితో జబ్బుపడిన వ్యక్తులను ప్రయాణించి వచ్చే దేశాల నుండి అప్రమత్తంగా ఉండాలని, వారిని ఐసోలేషన్ లో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం విమానాశ్రయాలను కోరింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP) కింద ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి లక్షణాలు, సూచనలను తెలియజేస్తూ మధ్యంతర సలహా పంపించారు.

“ప్రమాదకర దేశాల నుండి ఎవరైనా యాత్రికుల్లో దద్దుర్లు ఉన్నట్లయితే లేదా 21 రోజులలో ధ్రువీకరించబడిన లేదా అనుమానిత కేసులు కనిపిస్తే.. ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించాలి”అని సూచించారు.

Read Also: మంకీపాక్స్ వ్యాక్సినేషన్స్‌కు అంత అర్జెంట్ లేదు – WHO

లైంగిక క్రియ ద్వారా కూడా వ్యాప్తి
అనుమానిత వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని వెల్లడించింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి.. అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్ లకు పాకింది.

బ్రిటన్ లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. కోతుల్లోనే కనపించే ఈ వైరస్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా వైరస్ సోకుతుంది.