Bengaluru: మెట్రో పనుల్లో భాగంగా 833చెట్లు నరికేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) 833చెట్లు నరికేయనున్నట్లు పబ్లిక్ కన్సల్టేషన్ కు తెచ్చింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Bengaluru: మెట్రో పనుల్లో భాగంగా 833చెట్లు నరికేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

Updated On : June 25, 2021 / 12:22 PM IST

Bengaluru: బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) 833చెట్లు నరికేయనున్నట్లు పబ్లిక్ కన్సల్టేషన్ కు తెచ్చింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ.. సర్వీస్ పొడిగించనుంది. పనులకు అడ్డుగా ఉండటంతో తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ఈ నోటిఫికేషన్ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జులై 4కంటే ముందుగానే ఫైల్ చేసుకోవాలని బీబీఎంపీ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హెచ్ఎస్ రంగనాథ స్వామి అన్నారు.