Hyperloop: ఇది పూర్తయితే భారత్‌లో నేలపై నుంచే 350 కిలోమీటర్ల దూరం అరగంటలోనే వెళ్లవచ్చు.. ఏం చేస్తున్నారో తెలుసా?
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పూర్తి వివరాలు తెలిపారు.

నేలపై ప్రయాణం చేస్తే విమాన వేగంతో గమ్యస్థానాలకు వెళ్లగలమా? సమీప భవిష్యత్తులో అది కూడా సాధ్యమవుతుంది. ఇది కూడా భారత్‌లోనే. హైపర్‌లూప్ ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఈ పరీక్షల కోసం భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ అయింది.
మొత్తం 422 మీటర్ల పొడడుతో ఈ ట్రాక్ అభివృద్ధి చేశారు. రైల్వే మంత్రిత్వశాఖ సాయంతో మద్రాస్ ఐఐటీ ఈ ఘనత సాధించింది. ఇది అందుబాటులోకి తస్తే 350 కిమీ దూరం కేవలం 30 నిమిషాల్లోనే వెళ్లవచ్చు.
Also Read: కుప్పకూలిన విమానం.. 46 మంది మృతి
ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం సర్కారు, విద్యా సంస్థలు కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందకు తాము నిధులు అందించామన్నారు.
మద్రాస్ ఐఐటీ ప్రాంగణంలో ఈ ట్రాక్ రెడీ అయిందని, నూతన పరిజ్ఞానాలను అభివృద్ధి కోసం ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. తాము రెండు దఫాలు 20 లక్షల డాలర్ల గ్రాంట్‌ను ఇందుకోసం ఇచ్చినట్లు తెలిపారు. మరో 10 లక్షల డాలర్లను ఇస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో తొలి వాణిజ్య హైపర్‌లూప్ ప్రాజెక్టును చేపట్టడానికి రైల్వే అనుకుంటోంది.
ఈ హైస్పీడ్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని వాడతారు. దీంతో పాడ్‌ల కింది భాగం పట్టాలను తగలకుండా ఒక ఇంచు మేర గాల్లో ఎగురుతుంటాయి.