Bengaluru Horror : వామ్మో సైకో ప్రేయసి.. కొత్తగా లవ్ ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడ్ని కుర్చీకి కట్టేసి నిప్పంటించింది.. ఎందుకలా చేసిందంటే?
Bengaluru Horror : బెంళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు తనను సరిగ్గా పట్టించుకోవటం లేదనే కోపంతో.. కుర్చీలో కుర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించింది.
Bengaluru Horror
Bengaluru Horror : బెంళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు తనను సరిగ్గా పట్టించుకోవటం లేదనే కోపంతో.. ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. ‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ అతని కళ్లకు గంతలు కట్టింది.. ఆ తరువాత అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. పైగా ప్రియుడు శరీరం పూర్తిగా కాలిపోయేంత వరకు వీడియో తీసింది.. బెంగళూరులోని బైదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు విచారణలో ఈ కేసుకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..
Also Read : Kerala Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి.. 40మందికిపైగా గాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పేరు ప్రేర్నా (27), మృతుడు కిరణ్ (27). వీరిద్దరూ టెలికాం స్టోర్లో పనిచేస్తున్నారు. ఏడాదికాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇటీవల కాలంలో కిరణ్ తనను పట్టించుకోవటం లేదని, తనను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తాడని ప్రేర్నా భావించింది. ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి దక్షిణ బెంగళూరు అంజనాపురం ప్రాంతంలో నివాసం ఉంటుంది. మంగళవారం అన్న, ఆమె తల్లి ఇంట్లో లేకపోవటంతో ప్రియుడు కిరణ్ ను ఇంటికి రావాలని కోరింది. దీంతో కిరణ్ ప్రేర్నా ఇంటికి వెళ్లాడు. వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆ తరువాత తాను విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేస్తానని ప్రియుడికి తెలిపింది.
ప్రియుడు కిరణ్ ను ఓ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తరువాత అతన్ని తాళ్లతో కట్టేసింది. కళ్లకు గంతలు కట్టింది. ఆ తరువాత ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అతడు కాలిపోతుంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది. ప్రేర్నాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. అయితే, కిరణ్ తనను సరిగా పట్టించుకోలేదని, అందుకే ఇలా చేశానని విచారణలో ప్రేర్నా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
