Bhopal Man : కరోనా వచ్చిందని కిరోసిన్ తాగి చనిపోయాడు..తర్వాత రిపోర్టులో ఏముందంటే..

Bhopal Man : కరోనా వచ్చిందని కిరోసిన్ తాగి చనిపోయాడు..తర్వాత రిపోర్టులో ఏముందంటే..

Covid Bhopal

Updated On : May 21, 2021 / 8:53 AM IST

Drinking Kerosene : కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. వైరస్ రాకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకంటున్నారు. కానీ..కొంతమంది అతి జాగ్రత్తలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అపోహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న..ఓ మాతాజి కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదంటూ… తాగి మరణించింది. తాజాగా..కిరోసిన్ తాగితే..కరోనా చచ్చిపోతుందని పిచ్చిగా నమ్మాడో ఓ వ్యక్తి. కిరోసిన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వ్యక్తికి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. కరోనా సోకిందని తీవ్రంగా భయపడిపోయాడు. కరోనాను కిరోసిన్ చంపేస్తుందని తెలిసిన వ్యక్తి అతడికి చెప్పాడు. తనకు వచ్చిన కరోనా వైరస్ పోవాలంటే..కిరోసిన్ తాగడమే ఒక్కటే పరిష్కారమని..భావించాడు. అమాంతం కిరోసిన్ తాగాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి…చనిపోయాడు.

మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి..పోస్టుమార్టం నిర్వహించారు. కరోనా పరీక్ష నిర్వహించగా.. టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. అతడికి అసలు కరోనా సోకలేదని రిపోర్టుల్లో తేలింది. భయం వల్లే ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Read More : Maharashtra : 16 ఏళ్ల కుర్రాడి అద్భుత ప్రతిభ…హైరిజల్యూషన్ మూన్ ఫొటోస్