Gujarat CM Oath Ceremony: గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం.. 16మంది మంత్రులు సహా..
గుజరాత్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం కొత్త సెక్రటేరియట్ సమీపంలో జరిగిన కార్య్రకమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు ఎనిమిది మంది క్యాబినెట్ హోదాతో సహా 16 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

Gujarat Cm
Gujarat CM Oath Ceremony: గుజరాత్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం కొత్త సెక్రటేరియట్ సమీపంలో జరిగిన కార్య్రకమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు ఎనిమిది మంది క్యాబినెట్ హోదాతో సహా 16 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 11 మంది మాజీ మంత్రులు ఉన్నారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‍నాథ్ సింగ్ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన 200 మందికిపైగా సాధువులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
Gujarat CM Bhupendra Patel : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. రెండోసారి బాధ్యతలు స్వీకరణ!
గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతల్లో అసెబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు నిర్వహంచారు. ఈ ఫలితాల్లో గుజరాత్ చరిత్రలో ఏ పార్టీ సాధించనన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిల్లో 153 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయంఢంకా మోగించింది. 53శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థులకు పోలయ్యాయి. దీంతో ఏడోసారి వరుసగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
BJP's Bhupendra Patel takes oath as the Chief Minister of Gujarat for the second consecutive time. pic.twitter.com/TcWIq5HcYc
— ANI (@ANI) December 12, 2022
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన తరువాత శనివారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ను కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరడంతో.. సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా భూపేంద్ర పటేల్ తో పాటు క్యాబినెట్ మంత్రుల్లో కను దేశాయ్, రిషికేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్, కున్వర్జీ బవలియా, ములు బెరా, కుబేర్ దిండోర్, భానుబెన్ బబారియా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రులుగా హర్ష్ సంఘ్వీ, జగదీష్ విశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఆరుగురు రాష్ట్ర మంత్రుల్లో పర్షోత్తమ్ సోలంకి, బచు ఖబాద్, ముఖేష్ పటేల్, ప్రఫుల్ పన్షేరియా, కువెర్జి హల్పతి, భిఖుసిన్హ పర్మార్ లు ప్రమాణ స్వీకారం చేశారు.