Big Holi gift : హోళీ ఫెస్టివల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ. 10 వేలు అడ్వాన్స్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 10 వేలు అడ్వాన్స్ కింద ఇవ్వనున్నారు.

Big Holi gift : హోళీ ఫెస్టివల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ. 10 వేలు అడ్వాన్స్!

central government employees

Updated On : March 22, 2021 / 3:53 PM IST

central government employees : రంగు రంగుల హోళీ పండుగ దగ్గరకొస్తోంది. భారతదేశ వ్యాప్తంగా 2021, మార్చి 28వ తేదీ ఆదివారం లేదా…29వ తేదీ సోమవారం హోళీ పండుగను జరుపుకోనున్నారు. కానీ..కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడంతో పలు రాష్ట్రాలు పండుగపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది మోడీ ప్రభుత్వం. రూ. 10 వేలు అడ్వాన్స్ కింద ఇవ్వనున్నారు. మళ్లా..ఒకేసారి మొత్తం కట్టాలి కదా అనుకోకండి. నెల నెలకు రూ. 1000 చొప్పున పది నెలలు చెల్లిస్తే సరిపోతుందని కేంద్రం ప్రకటించింది. డబ్బులు అవసరం ఉన్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

6వ వేతన సంఘం కింద ఈ స్కీం ద్వారా గతంలో ఉద్యోగులకు రూ. 4 వేల 500 ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తుత మోడీ గవర్నమెంట్ రూ. 10 వేలకు పెంచింది. ఈ నగదు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద తీసుకోవచ్చని, అది 2021, మార్చి 31వ తేదీ లోపున తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తానికి వడ్డీ ఉంటుందని భావించకండి. వడ్డీ ఉండదని, కేవలం 10 సులభ వాయిదా పద్దతిలో చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ప్రీ పెయిడ్ రూపే కారు కింద ఈ రుణం ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న మూడు విడతల డీఏ, డీఆర్ ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది.