space news: భూమికి దగ్గరగా వస్తున్న భారీ గ్రహశకలం.. భూమిని తాకితే భారీ నష్టమే..

భూమికి అత్యంత సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం వస్తుందని, అది భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే16న ...

space news: భూమికి దగ్గరగా వస్తున్న భారీ గ్రహశకలం.. భూమిని తాకితే భారీ నష్టమే..

Space

Updated On : May 13, 2022 / 3:28 PM IST

space news: భూమికి అత్యంత సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం వస్తుందని, అది భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే16న అర్థరాత్రి 2.48 సమయంలో భూమికి దగ్గరగా వస్తుందని వారు తెలిపారు. ఈ గ్రహశకలం దాదాపు 1,608 అడుగుల వెడల్పు ఉందని, ఈ గ్రహశకలం భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వారు హెచ్చరించారు. ఆస్ట్రాయిడ్ 388945 గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారి. ఈ గ్రహశకలం ప్రతి రెండేళ్లకు ఒకసారి భూమికి అత్యంత సమీపంగా వెళ్తుంది. 2020 మే 17న లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..

ఈనెల 16న ఇది భూమికి 25 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని, అయితే 25లక్షల మైళ్ల దూరం అంటే అంతరిక్షంలో ఇది అసలు దూరమే కాదని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మళ్లీ ఇది 2024లో భూమి సమీపంలోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసాతో సహా అనేక అంతరిక్ష సంస్థలు ఈ ప్రమాదకరమైన గ్రహశకలాల నుండి భూమిని రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా నాసా ఇటీవల తన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్‌ను ప్రారంభించింది. ఇది కైనటిక్ ఇంపాక్ట్ ద్వారా దాని మార్గం నుండి భూమి వైపుకు వెళ్లే గ్రహశకలాన్ని మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది.