Bihar Polls: బిహార్ ఎన్నికలు.. ఎన్డీయే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు.. ఎవరికి ఎన్నంటే..

రెండో దశ పోలింగ్ నవంబర్ 122 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు.

Bihar Polls: బిహార్ ఎన్నికలు.. ఎన్డీయే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు.. ఎవరికి ఎన్నంటే..

Updated On : October 12, 2025 / 10:54 PM IST

Bihar Polls: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP-R) 29 స్థానాల్లో బరిలో దిగనుంది. కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవాంగ్ మోర్చా(HAM), కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా సారధ్యంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాకు(RLM) చెరో 6 చొప్పున సీట్లను కేటాయించారు.

కూటమి పక్షాలు ఈ సర్దుబాటును స్వాగతించాయని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. బిహార్ లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న 121 స్థానాలకు జరగనుంది. రెండో దశ పోలింగ్ నవంబర్ 122 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు. మరోవైపు ఈ నెల 15 నుంచి బిహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ నెల 15న బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడతారు.

Also Read: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా? శుభవార్త..! ఏమేం మారబోతున్నాయంటే? తెలుసుకోవాల్సిందే..