Raksha Bandhan : చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ .. వీడియో వైరల్

రాఖీ పౌర్ణమి సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్ రాజధాని పట్నాలో...

Raksha Bandhan : చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ .. వీడియో వైరల్

Bihar CM Nitish Kumar

Updated On : August 19, 2024 / 2:26 PM IST

Bihar CM Nitish Kumar : రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థినీలు రాఖీలు కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బ్రహ్మకుమారిలు, టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కార్యకర్తలు రాఖీలు కట్టారు.

Also Read : Raksha Bandhan 2024 : ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు.. వీడియోలు వైరల్

రాఖీ పౌర్ణమి సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆయన రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్నాలో ఓ చెట్టుకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. నితీశ్‌ కుమార్‌ చెట్టుకు రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.