బుద్ధగయలో హాలివుడ్ స్టార్ రిచర్డ్ గేర్

హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గేర్ బీహార్‌లోని బోధ్ గయాలోని కలచక్ర మైదానంలో దలైలామా బోధనా సమావేశ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. గురువారం (జనవరి 3,2020) బుద్ధగయలోని కాలచక్ర టీచింగ్ గ్రౌండ్‌లో దలైలామా ఐదు రోజుల బోధనకార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రిచర్డ్ గేర్ హాజరయ్యారు. రిజర్డ్ కు బౌద్ధ మతగురువులు ఘన స్వాగతం పలికారు.
కాగా..భారతదేశంలోని బీహార్ లో ఉన్న గయాలో జరిగే ఈ కార్యక్రమాలకు రిచర్డ్ హాజరు కావడం ఇదే మొదటిసారి కాదు.2017లో కూడా ఆయన ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన సంవత్సర వేడుకలను భారతదేశంలో జరుపుకోవటం అంటే రిచర్డ్ చాలా ఇష్టపడతారు. అందుకే న్యూ ఇయర్కు భారత్ వస్తుంటారు.
రిచర్డ్ గేర్ మాత్రమే కాదు..హాలీవుడ్ నటులు గెరార్డ్ బట్లర్, ఎమిలియా క్లార్క్ కూడా నూతన సంవత్సరాన్ని భారతదేశంలో జరుపుకున్నారు. 50 ఏళ్ల గెరార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ భారతీయ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. 2020 నూతన సంవత్సర వేడుకల జరుపుకునేందుకు వచ్చిన రిచర్డ్ హిమాలయాలకు వెళ్లారు. అక్కడ తీయించుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.హిమాలయాల్లో అతను సూర్యనామస్కర్ చేస్తున్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంది. గెరార్డ్ బట్లర్ ఈ చిత్రానికి “మీ కాంతి కొత్త దశాబ్దంలో ప్రకాశింపజేయండి. మీ అందరి ప్రేమను పంపుతోంది. హిమాలయాల నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు’అని పోస్ట్ చేశారు.
Bihar: Veteran Hollywood actor Richard Gere attended a teaching session of The Dalai Lama at Kalachakra ground in Bodh Gaya. (3.1.20) pic.twitter.com/NBnoNdLVP7
— ANI (@ANI) January 4, 2020