జాతీయ స్థాయి ఈత గాడి దుస్థితి : టీ అమ్ముకుంటూ..

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 06:38 AM IST
జాతీయ స్థాయి ఈత గాడి దుస్థితి : టీ అమ్ముకుంటూ..

Updated On : November 21, 2019 / 6:38 AM IST

బీహార్ లో ఓ వ్యక్తి టీ స్టాల్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అది పెద్ద విషయం కాదు చాలామంది టీస్టాల్ పెట్టుకుంటారు. కానీ అలా టీస్టాల్ నడుపుకునే వ్యక్తి ఒకప్పుడు క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో గొప్ప ఈతగాడి(స్విమ్మర్)గా పేరు తెచ్చుకున్నవాడు. కానీ ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవటానికి టీలు అమ్ముకుంటున్నాడు. క్రీడాకారులను ప్రభుత్వం పట్టించుకోకపోవటం వారు నిరాదరణకు గురవుతున్నారు. ఇతనీ పరిస్థితి కూడా అదే. 
 
బీహార్‌కు చెందిన జాతీయ స్థాయి ఈత క్రీడాకారుడు గోపాల్. ఎన్నో ఈత పోటీల్లో పాల్గొన్ని జాతీయ స్థాయిలో మెడల్స్ గెలుచుకున్నాడు. కానీ కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితిలో ఉన్నాడు. దీంతో  ప్రస్తుతం టీ దుకాణం నడుపుకుంటున్నాడు. బక్సర్ జిల్లా కాజీపూర్ పరిధిలోని నయాతోలాలో గోపాల్ టీలు అమ్ముతున్నాడు. గోపాల్ తన టీ షాపుకు ‘నేషనల్ స్విమ్మర్ టీ స్టాల్’ అనే పేరు పెట్టుకున్నాడు. 

1987లో గోపాల్ కోల్‌కతాలో జరిగిన జాతీయస్థాయి స్మిమ్మింగ్ పోటీలకు బీహార్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. 1988, 89లో కేరళలో జరిగిన జాతీయ ఈత పోటీల్లో గోపాల్ అద్బుత ప్రతిభను కనబరిచాడు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి  ప్రోత్సాహం లభించలేదు. 1990లో గోపాల్ పోస్టల్ శాఖలో ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు. కానీ ఉద్యోగం రాలేదు. దీంతో బ్రతుకు తెరువు కోసం టీస్టాల్ పెట్టుకున్నాడు. 

ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ..తనకు ఈనాటికి ఈతపై మక్కువ పోలేదన్నారు. ఏదోక పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉందనీ..తనలాగే తన కొడుకులిద్దరికీ ఈత అంటే చాలా ఇష్టమని తెలిపారు. కానీ తన పరిస్థితి కళ్లారా చూస్తున్న కొడుకులు సనీ, సోనూ కుమార్‌లకు ఈ రంగంలోకి రావాలనుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని గోపాల్ కోరుకుంటున్నాడు. కాగా..భారతదేశంలో ప్రభుత్వం ఆదరణ లేక ఇటువంటి క్రీడాకారులు రోడ్డు పడుతునే ఉన్నారు. ఎంతటి ప్రతిభ ఉన్నా రాణించలేకపోతున్నారు. బ్రతుకు తెరువు కోసం..కుటంబాలను పోషించుకోవటం కోసం కాయకష్టం చేస్తుకుంటూ జీవితాలను వెళ్లదీస్తున్నారు.