Mumbai : రైల్వే ట్రాక్ దాటాలనుకున్నాడు.. ప్రాణం మాత్రం పోలేదు, బైక్ తుక్కుతుక్కైంది

ముంబైలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్ వేయడంతో గేట్ మెన్ గేటును క్లోజ్ చేశాడు. అయినా.. అప్పటికీ కొంతమంది పట్టాలు దాటుతుండడం వీడియోలో కనిపించింది. మరికొంతమంది అక్కడనే వెయిట్...

Mumbai : రైల్వే ట్రాక్ దాటాలనుకున్నాడు.. ప్రాణం మాత్రం పోలేదు, బైక్ తుక్కుతుక్కైంది

Biker

Updated On : February 16, 2022 / 7:10 PM IST

Biker Narrowly Escapes : రైల్వే ట్రాక్ దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, రైలు వచ్చే సమయంలో గేటు దాటి ఎవరూ వెళ్లకూడదని అంటుంటారు. కానీ కొంతమంది ఆ ఏమవుతది లే అనుకుంటూ.. ట్రాక్ దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ వద్ద గేట్లు లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు ప్రాణాల నుంచి తప్పించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రైలు దాటాలని ప్రయత్నించాడు. ప్రాణం నుంచి మాత్రం తప్పించుకున్నాడు. కానీ బైక్ మాత్రం తుక్కుతుక్కైంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Read More : Karnataka : రోడ్లపై గుంతలు.. ఇంజినీర్ ఇన్ చీఫ్‌‌కు వారెంట్ జారీ చేసిన కోర్టు

ముంబైలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్ వేయడంతో గేట్ మెన్ గేటును క్లోజ్ చేశాడు. అయినా.. అప్పటికీ కొంతమంది పట్టాలు దాటుతుండడం వీడియోలో కనిపించింది. మరికొంతమంది అక్కడనే వెయిట్ చేస్తున్నారు. ఓ వాహనదారుడు పట్టించుకోకుండా పట్టాలు దాటేందుకు యత్నించాడు. రాజధాని ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకరావడం గమనించాడు. ముందుకెళుదామని వెళ్లగా..అకస్మాత్తుగా బైక్ స్కిడ్ అయింది. అంతే..అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు బైక్ ను ఢీకొంది. అతను పక్కకు కిందపడిపోయాడు. రైలు వాహనంపై నుంచి వెళ్లడంతో బైక్ మొత్తం తుక్కుతుక్కైంది. చిన్న పాటి గాయాలతో బయటపడిన ఆ వ్యక్తి ఏం చేయాలో తెలియక వెనక్కి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ట్రాక్ మీదకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.