Karnataka : రోడ్లపై గుంతలు.. ఇంజినీర్ ఇన్ చీఫ్‌‌కు వారెంట్ జారీ చేసిన కోర్టు

ఆదేశాల ఉన్నా కోర్టు విచారణకు గైర్హాజర్ అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ పై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అధికారిని కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా

Karnataka : రోడ్లపై గుంతలు.. ఇంజినీర్ ఇన్ చీఫ్‌‌కు వారెంట్ జారీ చేసిన కోర్టు

Karnataka

BBMP Chief Engineer : బెంగళూరు నగరంలోని రోడ్ల నిర్వహణ, గుంతలు ఉండడంపై కర్నాటక కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని ప్రధాన న్యాయమూర్తి రాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఫిబ్రవరి 15వ తేదీన చేపట్టనున్న విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని BBMP ఇంజినీర్ ఇన్ చీఫ్ ను ఫిబ్రవరి 07వ తేదీన కోర్టు ఆదేశించింది. గుంతలు పూడ్చడానికి ఉపయోగించే సాంకేతికతకు సంబంధించని సమాచారం కూడా ఇవ్వాలని కోర్టు సూచించింది. అయితే…ఆదేశాల ఉన్నా కోర్టు విచారణకు గైర్హాజర్ అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ పై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అధికారిని కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ ను ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణనను ఫిబ్రవరి 17కి వాయిదా వేసింది.

Read More : Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ ఉద్రిక్తతలు భారత ఎంబసీ మరో ప్రకటన

ఉత్తర్వులు జారీ చేయడంలో కోర్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని, న్యాయస్థానం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇస్తుందని.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోదని బృహత్ బెంగళూరు మహానగర పాలికే భావించకూడదని వ్యాఖ్యానించింది. బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉంటే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. కఠిన నిర్ణయాలు తీసుకొనే విధంగా వ్యవహరించకూడదని బీబీఎంపీ తరపున వాదిస్తున్న న్యాయవాదికి కోర్టు సూచించింది. కోర్టు ఈ పిటిషన్ విచారణకు తీసుకున్న సమయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ అనారోగ్యంతో ఉన్నందున కోర్టు ఎదుట హాజరు కాలేదని, ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని ఖరాఖండిగా కోర్టు వెల్లడించింది.

Read More : Coronavirus Cases Today: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా!

ఇది సరైన మార్గం కాదని, కోర్టు ఎదుట హాజరు కాలేమని ముందుగానే చెప్పాల్సి ఉండేదని, అలాంటిది ఏమీ చేయలేదని తెలిపింది. బెంగళూరు నగరంలో రోడ్ల పరిస్థితిపై హైకోర్టు గత సంవత్సరం నుంచి నిశితంగా పరిశీలిస్తోంది. ఏర్పడిన గుంతలను పూడ్చే విషయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారనే దానిపై దృష్టి సారించింది. కఠినమైన ఆదేశాలు, గడువులున్నా సిలికాన్ సిటీగా పిలవబడే బెంగళూరులో గుంతలు లేని రహదారులను ఇంకా నిర్ధారించలేదని తెలుస్తోంది. నగరంలో రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా.. పలువురు మృతి చెందుతున్నారు. ఇటీవలే ఓ ఉపాధ్యాయుడు గుంతలో పడి వెనుకాలే వచ్చిన వాహనం టైర్ల కింద నలిగి చనిపోయాడు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. మరి కోర్టు ఆదేశాలను ఇప్పటికైనా ఇంజినీర్ పాటిస్తార ? లేదా ? అనేది చూడాలి.