Coronavirus Cases Today: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus Cases Today: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా!

Corona Update

Coronavirus Cases Today: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కరోనా కేసులు 11శాతం పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 27లక్షల 23వేల 558 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 15న దేశంలో 27,409 కరోనా కేసులు నమోదయ్యాయి.

మునుపటి రోజుతో పోలిస్తే, 3వేల 206కేసులు పెరిగాయి. కరోనా కారణంగా గడిచిన 24గంటల్లో 514 మంది చనిపోగా.. నిన్న 347 మంది అంతకుముందు రోజు 346 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. బుధవారం మొత్తం 82వేల 988 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 514కి చేరుకుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా రోగుల సంఖ్య 3కోట్ల 7లక్షల 240కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4కోట్ల 18లక్షల 43వేల 446 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 5లక్షల 9వేల 872 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని మూడో వంతు కేసులు.. 11,776 కొత్త కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 173 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు అందజేసింది ప్రభుత్వం. గడిచిన 24గంటల్లో 41 లక్షల 54 వేల 476 డోసులు ఇవ్వగా, ఇప్పటివరకు 173 కోట్ల 86 లక్షల 81 వేల 476 డోసుల వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా వేశారు.