ఉండమ్మా బొట్టుపెడతా : బొట్టు బిళ్ళల ప్యాకెట్ పై మోడీ

“నేను మీ చౌకీదారుని” అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న పీఎఁ మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా బీజేపీ ప్రచారాస్త్రంగా వాడారు. మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీ కి ఓటేయ్యండని కోరిన సంఘటన కూడా మనం చూశాం. ఇప్పుడు ఏకంగా మహిళా ఓటర్లను ఆకర్షించటానికి బొట్టు బిళ్లల ప్యాకెట్ పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు
పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసిన బొట్ట బిళ్లలప్యాకెట్ పై ఒక వైపు నరేంద్రమోడీ , మరోవైపు బీజేపీ కమలం గుర్తు ముద్రించి ఉన్నాయి. పైన హిందీ లో ఫిక్ సే మోదీ సర్కార్ (మరోసారి మోడీ ప్రభుత్వం) అని రాసి ఉంది. ఈ ఫోటోలను పశ్చమ బెంగాల్ రాయ్ గంజ్ నియోజక వర్గ ఎంపీ అయిన సలీం ట్విట్టర్ లో పోస్టు చేశారు. పేటీఎం బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖ చిత్రంగా మారిపోయారని ఎండీ సలీమ్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు నిజంగా కంపెనీ ముద్రించిందా లేక ఇంకెవరైనా అనధికార వ్యక్తులెవరైనా ముద్రించారా అన్నది తేలాల్సి ఉంది.
So the Paytm brand ambassador is now the face of Paras Fancy Bindi too. #ModiHaiTohMumkinHai pic.twitter.com/NLsu3FjKV7
— Md Salim (@salimdotcomrade) March 28, 2019
Read Also : ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?