Madhya Pradesh : 5.1 కిలోల బరువున్న ఆడశిశువు జననం

ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోలకు పైగా బరువు శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Baby Girl Weighing Over Five KG : సాధారణంగా పుట్టే పసికందులు ఎంత బరువుతో పుడుతారు ? అంటే..మా..అయితే..1 కిలో..2.5 కిలోలు..మరికాస్త అయితే…3.5 కిలోల బరువుతో జన్మిస్తుంటారు అని అంటారు కదా…అయితే..ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోల బరువుకు పైగా శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మాల్దాకు చెందిన రక్షా కుశ్వాహ (29) గర్భిణీ. శనివారం పురిటినొప్పులు ఎక్కువ కావడంతో…ఆంజనేయ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. అక్కడ వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. పుట్టిన శిశువును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 5.1 కిలోల ఆడ శిశువు జన్మించింది. ఇంత బరువుతో కూడిన శిశువు జన్మించడం అసాధరణమని హెల్త్ సెంటర్ ఇన్ ఛార్జీ డాక్టర్ అజయ్ తోష్ వెల్లడించారు. పాప 54 సెంటిమీటర్ల హైట్ ఉందని తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగానే ఉందని, అయితే..పాప మూత్ర విసర్జనలో సమస్య ఉన్నట్లు తేలిందని… సమస్య చిన్నదేనని తేల్చారు. తల్లి రక్షా కుశ్వహాకు మధుమేహం, హార్మోనల్, ఊబకాయం వంటి సమస్యలు ఏమీ లేవని తెలిపారు.

Read More : Hero Splendor: మోడరన్ కేఫ్ రేసర్‌గా హీరో స్ప్లెండర్

ట్రెండింగ్ వార్తలు