Hero Splendor: మోడరన్ కేఫ్ రేసర్‌గా హీరో స్ప్లెండర్

ఇండియన్ ఆటో హిస్టరీలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా నిలిచిపోయింది హీరో స్ప్లెండర్. లుక్ మాత్రమే కాదు.. వాడకంలోనూ బెస్ట్ అనిపించుకున్న బైక్ ను.. రేసర్ బైక్ గా మార్చేశాడో వ్యక్తి. పైగా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

Hero Splendor: మోడరన్ కేఫ్ రేసర్‌గా హీరో స్ప్లెండర్

Hero Splendor

Hero Splendor: ఇండియన్ ఆటో హిస్టరీలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా నిలిచిపోయింది హీరో స్ప్లెండర్. లుక్ మాత్రమే కాదు.. వాడకంలోనూ బెస్ట్ అనిపించుకున్న బైక్ ను.. రేసర్ బైక్ గా మార్చేశాడో వ్యక్తి. పైగా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

రాజస్థాన్ లోని జోద్‌పూర్ లో నిఖిల్ బైక్ మాడిఫై చేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు రెడీ అయిన బైక్ కూడా అలా అయిందే. ఒరిజినల్ డిజైన్ పూర్తిగా మార్చేసిన బైక్ రేసింగ్ బైక్ అంటే నిజంగా నమ్మాల్సిందే.

రౌండ్ ఎల్లో టింటెడ్ హెడ్ ల్యాంప్ తో పాటు.. ముందు కూర్చొనే దగ్గర X మార్క్ డిజైన్ ఉంది. మడ్ గేర్స్ తీసేసి పాత టైర్లను మార్చి వైడ్ గా ఉన్న టైర్లను అమర్చారు. వాటితో పాటు బ్లాక్ ఫోర్క్ గేటర్స్ ఏర్పాటు చేశాడు. ఇక కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ అరేంజ్ చేసి దానిపై కస్టమ్ ఎడిషన్ కేఫ్ రేసర్ అని లెటరింగ్ చేయించాడు.

స్ప్లెండర్ సీటింగ్ మార్చి సింగిల్ పర్సన్ మాత్రమే కూర్చొనే విధంగా తయారుచేశాడు. హ్యాండిల్ కూడా మార్చడంతో పాటు స్పీడ్ ఇండికేషన్ కూడా మారింది.