Swiggy Report : నిమిషానికి 115 బిర్యానీలు ఆర్డర్..స్నాక్స్‌లో సమోసా
కరోనా కారణంగా స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది...

Biryani And Samosa
Most Ordered Food Of 2021 : ఇండియన్లు బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. బిర్యానీ తినని వారంటే చాలా అరుదే. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ తాజా గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఇండియన్లు నిమిషానికి 115 బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ ఆరవ వార్షిక స్టాటిస్టిక్స్ రిపోర్టులో వెల్లడైంది. గతేడాది నిమిషానికి 90 బిర్యానీలు బుక్ చేయగా.. ఈ ఏడాది అది మరింత పెరిగింది. దీంతో వరుసగా ఆరో ఏడాది కూడా ఇండియన్ల ఫేవరెట్ ఫుడ్‌గా బిర్యానీనే నిలిచింది.
Read More : Electric Vehicle : కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ వాహనం కొంటే ‘లక్షన్నర’ వరకు ఆదా
సాయంత్రం వేళల్లో, లేదంటే ఏదైనా సమయంలో ఆకలి వేసినప్పుడు తీసుకునే స్నాక్‌గా ఎక్కువ మంది సమోసాను తింటున్నట్టు స్విగ్గీ రిపోర్టులో తెలిపింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. సమోసా తర్వాత, పావ్ భాజి ఉంది. పావ్ భాజికి 21 లక్షల పైగా ఆర్డర్లు వచ్చాయి. గులాబ్ జామ్ కూడా ఎక్కువ మంది ఆర్డర్ చేసిన తీపి పదార్థంగా నిలిచింది. తీపి పదార్థాల జాబితాలో గులాబ్ జామ్ తర్వాత రసమలైను ఎక్కువ మంది ఆర్డర్ చేశారు.
Read More : Mulugu : మాజీ సర్పంచ్ మృతదేహం పోస్టుమార్టంపై వివాదం..ఎవరీ రమేశ్
కరోనా కారణంగా స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి.