Electric Vehicle : కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ వాహనం కొంటే ‘లక్షన్నర’ వరకు ఆదా
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లే కొత్త వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.

Electric Vehicle
Electric Vehicle : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లే కొత్త వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చాలామంది మైలేజ్ పైనే దృష్టి పెడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా మైలేజ్‌పై ఫోకస్ చేసి ఎక్కువ మైలేజ్ ఇచ్చే విధంగా వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచే రాయితీలు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాయితీలు ప్రకటించి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షితులయ్యేలా చేస్తుంది. మరోవైపు వాయు కాలుష్యం పెరుగుతుండటం, ఫ్యూయల్ ధరల్లో పెరుగుదల వంటి అంశాలు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి.
చదవండి : TS Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త!
అయితే ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను మరింత ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తూ వస్తుంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన వారికి 10 నుంచి 15 శాతం డబ్బు ఆదా అవుతుంది. అయితే భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం వ్యక్తిగతంగా వినియోగించే కార్లు లగ్జరి ఉత్పత్తుల కిందకి వస్తాయి. అందువల్ల ఉద్యోగస్తులకు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అయితే కొత్తగా చేర్చిన సెక్షన్ 80ఈఈబి కింద రుణం తీసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి మాత్రం పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
చదవండి : Electric Vehicles: ఇండియాలో 40ఏళ్ల క్రితమే టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్.. సాక్ష్యమిదే
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. వ్యక్తి కొనుగోలు చేసిన మొదటి ఎలక్ట్రిక్ వాహనానికి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి ఎలక్ట్రిక్ వాహన రుణం ఏప్రిల్ 1, 2019 – మార్చి 31, 2023 మధ్య లోన్ మంజూరై ఉండాలి. 2020-2021 నుంచి సెక్షన్ 80 ఈఈబీ కింద పన్ను ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. రుణం కోసం చెల్లించే వడ్డీపై మాత్రమే రూ.1.50 లక్షల మినహాయింపు ఉంటుంది.