AAP గెలుపు..బిర్యానీలకు ఫుల్ డిమాండ్

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 07:58 PM IST
AAP గెలుపు..బిర్యానీలకు ఫుల్ డిమాండ్

Updated On : February 12, 2020 / 7:58 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారి చేజక్కించుకుంది ఆప్ పార్టీ. మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే..ఎన్నికల అనంతరం కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆప్ విజయం దాదాపు ఖరారైందన్న విషయం రావడంతోనే..బిర్యానీల సేల్స్ అమాంతం పెరిగాయింట. బిర్యానీ వేడుకలు చేసుకుందాం..అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వైరల్ అయ్యాయి.

2020, ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లకు భారీగా బిర్యానీ ఆర్డర్లు వచ్చిపడ్డాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిర్యానీ సేల్స్ అమాంతం పెరగడం, భారీగా ఆర్డర్లు వస్తుండడంతో వివిధ రెస్టారెంట్ యజమానులు ఆఫర్స్ ప్రకటించాయి. ఒక బిర్యానీ తీసుకుంటే..మరొకటి ఫ్రీ లేదా..కొంతమొత్తం డిస్కౌంట్లు ప్రకటించాయి. 

CAA, NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా షహీన్ బాగ్ ప్రాంతంలో రెండు నెలలుగా నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే..ఈ ఆందోళలనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆందోళనల వెనక కేజ్రీవాల్ హస్తం ఉందని, ఇక్కడ పాల్గొనే ఆందోళనకారులకు బిర్యానీ సప్లై చేస్తున్నారంటూ యూపీ సీఎం ఆదిత్య నాథ్ విమర్శలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. 

ఆప్ విజయం సాధించడంతో..యోగి కామెంట్స్‌ని కోట్ చేస్తూ..బిర్యానీ తింటూ..సెలబ్రేషన్స్ చేసుకుందాం…అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. కేజ్రీ ఫ్యాన్స్, ఆప్ అభిమానులు బిర్యానీల సెంటర్లకు పరుగెత్తారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు పలు రెస్టారెంట్ల యజమానులు భారీ ఆఫర్స్ ప్రకటించాయి. భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించారు. మొత్తానికి ఆప్ విజయం పుణ్యమా..అని బిర్యానీ సేల్స్ పెరగడంతో రెస్టారెంట్ల యజమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. 

* 2020, ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ (70 స్థానాలు) ఎన్నికలు జరిగాయి. 
* 2020, ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల లితాలు విడుదలయ్యాయి. 
* ఈ ఎన్నికల్లో ఆప్‌కు 62సీట్లు వచ్చాయి. 

* బీజేపీ కేవలం 8సీట్లలో మాత్రమే విజయం సాధించింది. 
* కాంగ్రెస్ ఎక్కడా విజయం సాధించలేదు. 
* 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. 

* 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
* కొత్త రాజకీయాలకు ఇది ప్రారంభమని, ఇది కొత్త సంకేతమని కేజ్రీవాల్ అన్నారు. కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. 
* 2020, ఫిబ్రవరి 16వ తేదీన కేజ్రీవాల్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.