BJP Leader Uma Bharati: రాముడు, హనుమంతుడి పేర్లు ప్రస్తావిస్తూ.. సొంత పార్టీపై ఉమాభారతి ఘాటైన వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. రాముడు, హనుమంతుడు, హిందూ మతంపై బీజేపీకి పేటెంట్ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Uma Bharati
BJP Leader Uma Bharati: బీజేపీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సొంత పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాముడు, హనుమంతుడు, హిందూ మతంపై బీజేపీకి పేటెంట్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. తనకు రాముడు, హనుమంతుడు, త్రివర్ణ పతాకం, గంగ, ఆవుపై విశ్వాసం కలిగించింది బీజేపీ కాదని, అంతకుముందే అది తనలో ఉందని అన్నారు. వారిని ఎవరైనా నమ్మొచ్చు అన్నారు. మన విశ్వాసం అనేది రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉడాలని తెలిపారు.
BJP Bharati Shetty : మహిళలు నైట్ డ్యూటీలు చేయటానికి అనుమతించవద్దు : బీజేపీ మహిళా నేత
లోధి సంఘం కార్యాలయంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీజేపీకి నేను నమ్మకమైన సైనికురాలినని చెప్పిన ఉమాభారతి, తమ సామాజికవర్గంలోని ప్రజలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. నేను వస్తాను, మా పార్టీ వేదికపై నుండి ఓట్లు అడుగుతాను. మీకు బీజేపీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటే ఓట్లేయండి అని సూచించారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉమాభారతి సమర్థించారు. ఈ క్రమంలో.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఆమె మాట్లాడుతూ..దేశం ఎక్కడ విడిపోతోంది అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే). రాహుల్ గాంధీ తన యాత్రను పీఓకేకి తీసుకెళ్లాలని అన్నారు.