తథాస్తు దేవతలు దీవించారు: మమతను కౌగలించుకుంటానన్న బీజేపీ నేతకు కరోనా

BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది.
స్వల్ప అనారోగ్యం కారణంగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోల్ కతాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలిపారు.
ఇటీవల జాతీయ కార్యదర్శిగా నియమితులైన అనుపమ్ హజ్రా తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్.. అనుపమ్‌పై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.