Manipur : ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌‌కు స్కూటర్లు, ల్యాప్ టాప్‌‌లు.. బీజేపీ మేనిఫెస్టో

రాష్ట్రంలోని మహిళలకు సాధికారిత కల్పించేందుకు ప్రతిభ ఉన్న బాలికలందరికీ ఉచితంగా స్కూటీలు అందచేస్తామని హామీనిచ్చారు...పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాయాన్ని ఏడాదికి రూ. 6 వేల నుంచి

Manipur : ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌‌కు స్కూటర్లు, ల్యాప్ టాప్‌‌లు.. బీజేపీ మేనిఫెస్టో

Manipur Bjp

BJP Manipur Manifesto : ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలు ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతుంటాయి. అలాగే ప్రస్తుతం జరుగతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు హామీలు ఇస్తున్నాయి. మణిపూర్ లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ప్రతిభావంతులైన మహిళా కళాశాల విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు, సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ రూ. 1000కి పెంచడం, రూ. 100 కోట్ల స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలో గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకపోతోందని, డ్రగ్స్ దందాను అరికట్టడంతో పాటు చట్టబద్ధమైన పాలనతో సుస్థిరత సాధించామని చెప్పారు.

Read More : Modi-Channi : గురుగోవింద్‌ ఎక్కడ పుట్టారో తెలుసా..? చన్నీ “భాయియే” మాటకు మోడీ మార్క్ పంచ్

రాష్ట్రంలోని మహిళలకు సాధికారిత కల్పించేందుకు ప్రతిభ ఉన్న బాలికలందరికీ ఉచితంగా స్కూటీలు అందచేస్తామని హామీనిచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. Rani Gaidinliu Nupi Maheiroi Singi స్కీం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు రూ. 25 వేలు ఇస్తామని హామీనిచ్చింది. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం లబ్దిదారులకు సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఉన్న పెన్షన్ రూ. 200 నుంచి రూ. 1000కి పెంచుతామన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని జేపీ నడ్డా వెల్లడించారు. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న సన్నకారు, చిన్న మరియ భూమి లేని రైతుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందచేస్తామన్నారు.

Read More : BJP MLA Raja Singh:‘బీజేపీకి ఓట్లు వేయనివారి ఇళ్లపైకి బుల్ డోజర్లు’వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC నోటీసులు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాయాన్ని ఏడాదికి రూ. 6 వేలు నుంచి రూ. 8 వేలు పెంచుతామని, మణిపూర్ స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడం కోసం ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక వేత్తలకు రూ. 25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడానికి రూ. 100 కోటల స్టార్ట్ అప్ మణిపూర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్, సీఎంతో పాటు బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదా దేవి, తదితరులు పాల్గొన్నారు.