BJP MLA : యూపీలో రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు
అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు....

BJP MLA Ramdular Gond
BJP MLA : అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు. 2014వ సంవత్సరంలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో కోర్టు రాందులర్ గోండ్ కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ALSO READ : Hijab : కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత.. మహిళలు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్దరామయ్య
గోండ్ సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ స్థానం నుండి శాసనసభ్యుడిగా పనిచేశారు. సోన్‌భద్రలోని ఎంపి-ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా,సెషన్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషి అయిన గోండుకు రూ. 10 లక్షల జరిమానాను కోర్టు విధించింది. ఆ మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి అందజేస్తామని న్యాయమూర్తి తెలిపారు.
ALSO READ : Anju renamed Fatima : పాక్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చి పిల్లల్ని కలిసిన అంజూ…కొత్త ట్విస్ట్
కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు గోండుపై సెక్షన్ 376 , 506 , లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు.