Delhi: రెండవ రాత్రి కూడా కొనసాగుతున్న బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
ప్రకటన ప్రకారమే ఇరు పార్టీల నేతలు అసెంబ్లీ హౌస్‌లో నిరసనకు దిగారు. అయితే కొద్ది సమయానికి ఇరు పార్టీల నేతలను మార్షల్స్ హౌస్ బయటకు పంపారు. బయటికి వచ్చిన అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, బీజేపీ ఎమ్మెల్యేలు భగత్ సింగ్, రాజ్‌గురు విగ్రహాల వద్ద ప్లకార్డులు చేతపట్టి ధర్నా చేపట్టారు.

BJP MLAs will continue their overnight protest at the Delhi Assembly
Delhi: లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ను బర్తరఫ్ చేయాలని సోమవారం భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన మంగళవారం రాత్రి సైతం కొనసాగుతోంది. వాస్తవానికి సోమవారం రాత్రంతా నిరసన కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తొలుత నిరసనకు పిలుపునిచ్చారు. అనంతరమే బీజేపీ సైతం నిరసనకు పిలుపునిచ్చింది.
అసెంబ్లీ ప్రాంగణంలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పోటాపోటీగా నిరసన చేపట్టారు. రాత్రంతా నిరసన చేపడతామని మొదట ఆప్ ప్రకటించింది. అనంతరం బీజేపీ సైతం ఇదే ప్రకటన చేసింది. ప్రకటన ప్రకారమే ఇరు పార్టీల నేతలు అసెంబ్లీ హౌస్‌లో నిరసనకు దిగారు. అయితే కొద్ది సమయానికి ఇరు పార్టీల నేతలను మార్షల్స్ హౌస్ బయటకు పంపారు. బయటికి వచ్చిన అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, బీజేపీ ఎమ్మెల్యేలు భగత్ సింగ్, రాజ్‌గురు విగ్రహాల వద్ద ప్లకార్డులు చేతపట్టి ధర్నా చేపట్టారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.1,400 కోట్ల స్కామ్ చేశారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని ధర్నా సందర్భంగా ఆప్ డిమాండ్ చేసింది. సక్సేనాపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. ఆప్ తీరును బీజేపీ తీవ్రంగా తప్పు పడుతోంది. కేంద్రాన్ని విమర్శల పాలు చేయడానికే అసెంబ్లీని ఆప్ ఉపయోగించుకుంటోందని, దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
War Of Words: జాగ్రత్త.. ఆ పని చేయకపోతే కేజ్రీవాల్ వస్తాడు: అస్సాం ముఖ్యమంత్రికి ఆప్ హెచ్చరిక