Bulldozer on BJP Leader House: తిరగబడ్డ బుల్డోజర్.. బీజేపీ ఎమ్మెల్సీ ఇంటిపైకి బుల్డోజర్ ప్రయోగించిన బిహార్ ప్రభుత్వం
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్‌హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

BJP Leader House Bulldozed: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాల పేరుతో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసే ఘటనలు చూస్తూనే ఉన్నాం. నేరస్తులు, అక్రమార్కుల ఇళ్లపై బుల్డోజర్ పంపించడం బీజేపీకి పెద్ద ప్రచారాన్నే తెచ్చిపెట్టింది. అయితే బిహార్ రాష్ట్రంలో బుల్డోజర్ తిరగబడింది. వాస్తవానికి బీజేపీ నేతలు ఇతరులపైకి బుల్డోజర్లు పంపించడమే తెలుసు కానీ, బీజేపీ నేత ఇంటిపైకే బుల్డోజర్ వచ్చింది. బుధవారం సాయంత్రం గోపాల్‌గంజ్‌లో బీజేపీ ఎమ్మెల్సీ రాజీవ్ కుమార్ సింగ్ ఇంటిపైకి అధికార యంత్రాంగం బుల్డోజర్‌తో వచ్చి దాడి చేసింది.
Mahabubabad: అర్థరాత్రి టమాటాలు చోరీ.. బాక్సులు మాయం.. రంగంలోకి పోలీసులు
నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరి మలుపు దగ్గర రాజీవ్ సింగ్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. అయితే ఇంటి గేటు సహా, గోడలను బుల్డోజర్ కూల్చివేసింది. ఎన్‌హెచ్-27 భూమిని బీజేపీ ఎమ్మెల్స ఆక్రమించారని, దాన్ని ఇంటి స్థలంలో కలిపేశారని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ విషయమై పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదని, ఆక్రమణలు తొలగించలేదని, అందుకే బుల్డోజర్ పంపాల్సి వచ్చిందని తెలిపారు.
Threads App Features: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. యూజర్లు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి..
అయితే అధికారులు చెప్పినదానికి రాజీవ్ కుమార్ భిన్నంగా స్పందించారు. ఆక్రమణను స్వయంగా తొలగించాలని బీజేపీ ప్రతినిధి బృందం జిల్లా అధికారిని కలిసిందని ఆయన తెలిపారు. అయితే దానికి తాను రెండు రోజుల సమయం అడిగినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచే తన కూలీలు ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా సాయంత్రం 4:50 గంటలకు జిల్లా అధికార యంత్రాంగం రెండు జేసీబీలతో అక్కడికి చేరుకుని, హడావుడిగా ఇంటి గోడ, గేటు పగులగొట్టారని రాజీవ్ అన్నారు.
MadhyaPradesh CM : మూత్ర విసర్జన ఘటనలో.. గిరిజన బాధితుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్‌హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తెలిపారు.
ఆక్రమణదారులకు తొలుత నోటీసులు ఇచ్చామని గోపాల్‌గంజ్‌లోని సదర్ మండలం సీఓ రాకేష్‌కుమార్ తెలిపారు. అనంతరం బుల్డోజర్ ఉపయోగించి ఆక్రమణను తొలగించారు. మొదటి రౌండ్‌లో ఎన్‌హెచ్-27లోని భూమిని ఆక్రమించిన 149 మంది ఇళ్లు, దుకాణాల్లోని ఆక్రమణలను తొలగించినట్లు తెలిపారు. రెండో రౌండ్‌లో 28 మంది ఆక్రమణదారులను గుర్తించి ఎన్‌హెచ్ భూమిలో ఆక్రమణలను తొలగిస్తున్నట్లు రాకేష్ కుమార్ పేర్కొన్నారు.