మావోయిస్టుల కంటే బీజేపీ ప్రమాదకరమైనది

మావోయిస్టుల కంటే బీజేపీ ప్రమాదకరమైనది

Mamata-Banerjee

Updated On : January 20, 2021 / 6:28 AM IST

Mamata Banerjee మరో మూడు నెలల్లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో విమర్శలు-ఆరోపణలు..సవాళ్లు-ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయం వెడెక్కింది. బీజేపీ-తృణముల్ మధ్య మాటల యుద్దం ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా భారతీయ జనతాపార్టీపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు.

మావోయిస్టుల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని మమతా బెనర్జీ విమర్శించారు. ఎన్నికలొస్తేనే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. శాసనసభ ఎన్నికల ముందట తృణమూల్​ కాంగ్రెస్​ నుంచి భాజపాకు వలసలు పెరగటంపై మమత స్పందించారు. ఎవరైనా బీజేపీలో చేరడానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చన్నారు. అయితే కాషాయపార్టీ ముందు తాము ఎప్పటికీ తలవంచబోమని అన్నారు.

పురూలియా జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమత..జంగల్ మహల్ ఏరియాలోని ఆదివాసీ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు మమత. లోక్​సభ ఎన్నికల్లో జంగల్​ మహల్​ ఆదివాసీలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన బీజేపీ… గెలిచాక వారిని పట్టించుకోలేదని విమర్శించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పురూలియాతో సహా జంగల్ మహల్ ఏరియాలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజకీయాలనేవి గంభీరమైన సిద్దాంతాలు మరియు ఫిలాసఫీ అని.. అయితే అవి బట్టలమాదిరిగా రోజూ మార్చే సిద్దాంతాలుగా ఉండకూడదని మమత అన్నారు.