చెప్పులతో కొట్టుకున్న బీజేపీ నేతలు

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 01:25 PM IST
చెప్పులతో కొట్టుకున్న బీజేపీ నేతలు

Updated On : March 6, 2019 / 1:25 PM IST

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ శిలాఫలకం పై తన పేరు ఎందుకు రాయలేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠి సమావేశంలో నిలదీశాడు అంతటితో ఆగకుండా తన పేరు లేకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతే కాదు ఏకంగా ఎమ్మెల్యేని ఎంపీ చెప్పుతో కొట్టాడు. తొటి ప్రజాప్రతినిధి అనే విషయం కూడా ఆలోచించకుండా ఎంపీ ఎమ్మెల్యేని చెడామడా వాయించేశాడు. అటు ఎమ్మెల్యే కూడా తన సీటు నుంచి లేచి వచ్చి ఎంపీపై దాడికి దిగాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో సమావేశం కాస్తా రసాబాసగా మారింది. ఆ తర్వాత ఇద్దరు బీజేపీ ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా గొడవపడ్డారు.