72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు

ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది.

72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు

BJP MP Candidates 2nd list List

Updated On : March 13, 2024 / 7:51 PM IST

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారే ఇందులో ముగ్గురు ఉన్నారు. ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు.

తెలంగాణ నుంచి వీరే..

  • ఆదిలాబాద్-గోడెం నగేశ్
  • పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
  • మెదక్-రఘునందన్ రావు
  • మహబూబ్ నగర్-డీకే అరుణ
  • నల్గొండ-శానంపూడి సైదా రెడ్డి
  • మహబూబాబాద్-సీతారాం నాయక్

నల్గొండ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. గతంలో హుజూర్ నగర్ శాసనసభకు ఉప ఎన్నికల్లో (2019) ఉత్తమ్ సతీమణి పద్మావతిపై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సైదిరెడ్డి. ఇవాళ ఉదయం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై సైదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారే పోటీకి వెనకాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కీలక నేతలు ప్రత్యర్థులకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవలే మొదటి జాబితాలో 195 స్థానాల అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా ఇద్దరు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు.

పూర్తి జాబితా

Also Read: జనసేన పోటీచేసే మరో 5 స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్