Bihar: బీజేపీ బలం తగ్గుతుందనగానే ఆ ముగ్గురు అల్లుళ్లు వస్తారు.. తేజశ్వీ విమర్శలు

ఇక ఆయన నూతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ‘‘మేము క్రికెటర్లం. మా జోడి (జేడీయూ, ఆర్జేడీ) చాలా కాలం పాటు ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఇన్నింగ్స్ నుంచే బిహార్ అభివృద్ధి జరుగుతుంది. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రెండు పార్టీలు ధ్రుఢమైన సంకల్పంతో పని చేస్తాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఔట్ కాలేరు. ఏ ఒక్కరూ డ్రాప్ అవ్వలేరు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, వారి అవసరాలను తీర్చడమే మా ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు.

Bihar: బీజేపీ బలం తగ్గుతుందనగానే ఆ ముగ్గురు అల్లుళ్లు వస్తారు.. తేజశ్వీ విమర్శలు

BJP son in laws CBI and ED and IT says Tejashwi yadav

Updated On : August 24, 2022 / 4:29 PM IST

Bihar: భారతీయ జనతా పార్టీపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ మాటాల తూటాలు సంధించారు. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ బలం తగ్గుతోందనగానే ఈడీ, సీబీఐ, ఐటీ రంగంలోకి దిగుతాయని, బీజేపీకి అవి అల్లుళ్ల వంటివని తేజశ్వీ ఎద్దేవా చేశారు. బుధవారం నూతన ప్రభుత్వ బలపరీక్ష నేపధ్యంలో అసెంబ్లీ సమావేశం జరిగింది. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం ఇదే. కాగా, అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజునే బీజేపీపై తేజశ్వీ విరుచుకుపడ్డారు.

‘‘భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి సరైన మద్దతు లేదు. అందుకే కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రజల మద్దతు ఉన్నవారిని అణచి వేయాలని చూస్తుంది. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ పడిపోతుందనగానే బీజీపీ అల్లుళ్లు (ఈడీ, సీబీఐ, ఐటీ) రంగంలోకి దిగుతారు. నేను విదేశాలకు వెళ్తే నాకు లుక్ఔట్ నోటీసు పంపించారు. మరి నీరవ్ మోదీ పారిపోతే ఏం చేశారు? ఏదైనా హెచ్చరిక చేశారా? ఏదైనా నోటీసు పంపారా? ఎందుకంటే వారు ఎవరి అండతో పోయారో మనకు తెలియనది కాదు’’ అని తేజశ్వీ అన్నారు.

ఇక ఆయన నూతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ‘‘మేము క్రికెటర్లం. మా జోడి (జేడీయూ, ఆర్జేడీ) చాలా కాలం పాటు ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఇన్నింగ్స్ నుంచే బిహార్ అభివృద్ధి జరుగుతుంది. దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రెండు పార్టీలు ధ్రుఢమైన సంకల్పంతో పని చేస్తాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఔట్ కాలేరు. ఏ ఒక్కరూ డ్రాప్ అవ్వలేరు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, వారి అవసరాలను తీర్చడమే మా ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు.

Minister Gadkari : త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు .. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచే వసూలు