మీ మద్దతు అవసరం లేదు : బీజేపీ కీలక ప్రకటన
హర్యానా లోక్‌హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కందా సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని

హర్యానా లోక్‌హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కందా సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని
హర్యానా లోక్‌హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కందా సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. ‘‘గోపాల్ కందా మద్దతు బీజేపీ తీసుకోవడం లేదు.. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాం’’ అని అన్నారు.
కందాతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్యేపై కేసులుండటం, వివాదాస్పద ఎమ్మెల్యే కావడంతో బీజేపీ ఆయన మద్దతు ఎలా తీసుకుంటుందని సాక్షాత్తూ బీజేపీ సీనియర్ నేత ఉమా భారతితో పాటు ప్రతిపక్షాలు కూడా బీజేపీని టార్గెట్ చేశాయి. దీంతో కందా మద్దతు తమకు అవసరం లేదని రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.
హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం(అక్టోబర్ 27,2019) సాయంత్రం ముహూర్తం ఖరారరైనట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం(అక్టోబర్ 26,2019) కట్టర్ ను శాసనాసభా పక్షనేతగా బీజేఎల్పీ ఎన్నుకుంది. హర్యానాలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది.