Hunters Murder Police: మధ్యప్రదేశ్‌లో ఘోరం: కృష్ణ జింకల వేటకు వచ్చి ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపిన వేటగాళ్లు

గుణా జిల్లా సాగా బర్ఖెడ గ్రామంలో ముగ్గురు పోలీసు అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. సాగా బర్ఖెడ సమీపమాలోని అడవిలో కృష్ణజింకల వేటకు వచ్చిన వేటగాళ్లను..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు

Hunters Murder Police: మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. గుణా జిల్లా సాగా బర్ఖెడ గ్రామంలో ముగ్గురు పోలీసు అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. సాగా బర్ఖెడ సమీపమాలోని అడవిలో కృష్ణజింకల వేటకు వచ్చిన వేటగాళ్లను..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ముగ్గురు పోలీసులపై వేటగాళ్లు తుపాకులతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ రామ్ మీనా మరియు కానిస్టేబుల్ నీరజ్ భార్గవ అనే ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. అడవిలో వేటగాళ్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు సాగా బర్ఖెడ గ్రామ పరిధిలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై వేటగాళ్లు కాల్పులు జరిపారు.

Other Stories:Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు

కాగా, ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, నిందితులను విడిచిపెట్టబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. “గుణా సమీపంలో వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు వీరమరణం పొందారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని” హోంమంత్రి సానుభూతి తెలిపారు. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Other Stories:Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం

ట్రెండింగ్ వార్తలు