Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని మండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.

Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం

Delhi Fire Accident

Updated On : May 13, 2022 / 11:06 PM IST

Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని మండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఇప్పటివరకు 26 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకుపోయిన దాదాపు 60-70 మందిని ప్రాణాలతో కాపాడారు. మూడు అంతస్తుల కమర్షియల్ భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.