నర్మదా నదిలో పడవ ప్రమాదం: 6 గురి మృతి

ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో పడవ మునిగిపోయిన ఘటనలో 6 గురు మరణించారు. 36మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మకరసంక్రాంతి పండుగ సందర్భంగా నర్మాదా నదిలో నిర్వహించాల్సిన పూజలో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న పడవ భూషణ్‌గావ్ గ్రామం వద్ద ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో ఈఘటన జరిగిందని అధికారులు చెప్పారు. మరణించిన వారంతా ఉత్తరమహారాష్ట్రలో గిరిజనులు ఎక్కవగా ఉండే ఓగ్రామానికి చెందిన వారని ర పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటంవల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.