మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా :మృతదేహాన్ని చెత్తబండిలో పడేసి..

  • Published By: nagamani ,Published On : June 12, 2020 / 05:05 AM IST
మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా :మృతదేహాన్ని చెత్తబండిలో పడేసి..

Updated On : June 12, 2020 / 5:05 AM IST

కరోనా మహమ్మారి మనుషుల్లో ఉండే మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. వైరస్ వస్తుందనే భయంతో మనుషుల మధ్య దూరాన్నే కాదు..మానవత్వపు విలువల్ని కూడా చంపేస్తోంది. కరోనా భయంతో మనుషులు కఠినాత్ముల్లా తయారవుతున్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే సహాయం చేయడానికి కూడా వెనకాడుతున్నారు. కళ్లముందే ఓ మనిషి కుప్పకూలి పడిపోతే అయ్యో పాపం ఏం జరిగిందో ఏమిటో అని అనుకుంటున్నారు తప్ప దగ్గరకు మాత్రం వెళ్లట్లేదు.ఎందుకంటే ఆ వ్యక్తికి కరోనా వైరస్ ఉందేమో అనే భయం.

ఉత్తరప్రదేశ్‌లో అటువంటి ఓ ఘోరం జరిగింది. రోడ్డుపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది ఏం జరిగిందో అని దూరంగా ఉండి కళ్లప్పగించి చూస్తుండిపోయారే తప్ప దగ్గరకు కూడా వెళ్లలేదు.అలా కుప్పకూలిన వ్యక్తి చనిపోయాడు. కానీ ఎవ్వరూ దగ్గరకు కూడా రాలేదు. అక్కడే ఉన్న కొంతమంది అబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్  కూడా రాలేదు. కారణం కరోనా భయం.

దీంతో మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు మొదట్లో భయపడ్డారు. రాలేమని అన్నారు.కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించారు. బలరామ్‌పూర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల మహ్మద్ అన్వర్  స్థానికంగా ఉండే ఓ గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లాడు. లోపలికి వెళ్లకుండానే ఏం జరిగిందో ఏమోగానీ.. గేటు దగ్గరే  కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

దీనిపై బలరాంపూర్ సోలిస్ సూపరింటెంబెంట్ దేవ్ రంజన్ వర్మ మాట్లాడుతూ..ఓ వ్యక్తి మరణ వార్త తెలియగానే మిన్సిపల్ సిబ్బందిని..పోలీసులను ఘటనాస్థలానికి పంపించామని తెలిపారు.కానీ మృతదేహాన్ని అలా చెత్త వ్యాన్ లో పడేయటం అమానవీయం..అతడు కరోనా అనుమానితుడే అయినా అది సరైనదికాదనీ అన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన నగర సిబ్బంది పీపీఈ కిట్లు ధరించలేదని అన్నారు.

పోలీసులు కూడా మృతదేహాన్ని అలా చెత్తబండిలో పడేస్తున్న సమయంలోఅక్కడే ఉన్నారనీ దాన్ని వారు కనీసం వారించకపోవటం సరైంది కాదన్నారు. అందుకే ఆ ముగ్గురు పోలీసులను..ఏడుగురు మున్సిపల్ సిబ్బందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్ట్ అయిన పోలీసుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారని తెలిపారు. 

Read: గులాబీ రంగులోకి మారిన చెరువు..ఎందుకలా