Vistara flight : ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ నుంచి పూణే వెళ్లే విస్తారా విమానంలో బాంబు పెట్టినట్లు శుక్రవారం జీఎంఆర్ కాల్ సెంటర్‌కు హెచ్చరిక వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రయాణికులందరినీ, వారి లగేజీని సురక్షితంగా విమానం నుంచి కిందకు దింపారు....

Vistara flight : ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

Vistara flight

Updated On : August 18, 2023 / 12:25 PM IST

Vistara flight : ఢిల్లీ నుంచి పూణే వెళ్లే విస్తారా విమానంలో బాంబు పెట్టినట్లు శుక్రవారం జీఎంఆర్ కాల్ సెంటర్‌కు హెచ్చరిక వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రయాణికులందరినీ, వారి లగేజీని సురక్షితంగా విమానం నుంచి కిందకు దింపారు. (Bomb threat on Pune-bound Vistara flight) శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీ (Delhi airport) నుంచి పూణే వెళ్లాల్సిన విస్తారా విమానం బాంబు బెదిరింపు కాల్ తో నిలిపివేశారు.

Manipur violence : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి

బాంబు బెదిరింపు కాల్ వచ్చినపుడు విమానంలో 100 మంది ప్రయాణికులున్నారు. బాంబు బెదిరింపు కాల్ రాగానే వారిని విమానం నుంచి కిందకు దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. (inspection underway) ఆగస్టు 18న ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లాల్సిన విమానం యూకే971 ఆలస్యమైందని భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేస్తున్నారని విస్తారా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.