PM Modi: నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సమావేశం.. చైనా అధ్యక్షుడితో మోదీ ఏమన్నారో తెలుసా?

ఐదేళ్ల తర్వాత తమ మధ్య అధికారికంగా సమావేశం జరుగుతోందని తెలిపారు.

PM Modi: నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సమావేశం.. చైనా అధ్యక్షుడితో మోదీ ఏమన్నారో తెలుసా?

PM Modi, Xi jinPing

Updated On : October 24, 2024 / 7:42 AM IST

రష్యాలో బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగడం ఐదేళ్లలో ఇదే తొలిసారి.

ఈ సమావేశంలో జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడుతూ.. ఆయనను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఐదేళ్ల తర్వాత తమ మధ్య అధికారికంగా సమావేశం జరుగుతోందని తెలిపారు. భారత్-చైనా సంబంధాల అంశం కేవలం ఇరు రెండు దేశాల పౌరులకు మాత్రమే సంబంధించింది కాదని తన నమ్మకమని చెప్పారు.

ఇది ప్రపంచం మొత్తానికి శాంతి, స్థిరత్వం, పురోగతికి కూడా చాలా ముఖ్యమైనదని తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దు వెంట గత నాలుగేళ్లలో తలెత్తిన సమస్యలపై ఏకాభిప్రాయం కుదిరిందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సరిహద్దులో శాంతి, సుస్థిరత ఉండేలా చూడటమే తమ ప్రాధాన్య అంశమని తెలిపారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని చెప్పారు. ఈ సమస్యలన్నింటి గురించి మాట్లాడే అవకాశం తమకు లభించిందని అన్నారు.

జిన్‌పింగ్ మాట్లాడుతూ.. మోదీని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఐదేళ్ల తర్వాత అధికారికంగా ఈ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారని గుర్తుచేశారు. తమ సమావేశంపై భారత్‌, చైనా ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా దృష్టి సారించిందని చెప్పారు. చైనా, భారత్‌ రెండూ పురాతన నాగరికతలు కలిగిన, అభివృద్ధి చెందుతున్న దేశాలని అన్నారు.

Gold Rates: దీపావళి ముందు మళ్లీ పెరిగిన బంగారం ధరలు