Borewell: 70 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ తొమ్మిదేళ్ల బాలుడు.. 7 గంటలు కష్టపడి..

స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని, బాలుడు బోరుబావిలో 70 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

Borewell: 70 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ తొమ్మిదేళ్ల బాలుడు.. 7 గంటలు కష్టపడి..

Borewell

Updated On : May 20, 2023 / 10:07 PM IST

Rajasthan: రాజస్థాన్ లో 70 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడ్డ తొమ్మిదేళ్ల బాలుడిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. జైపూర్ జిల్లాలోని (Jaipur district) జాబ్నర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం భోజ్‌చగకా గ్రామంలో ఆడుకుంటున్న అక్షిత్ అనే బాలుడు ఒక్కసారిగా బోరుబావిలో పడ్డాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని, బాలుడు బోరుబావిలో 70 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఏడు గంటల పాటు కష్టపడి అతడికి బయటకు తీశారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ… బాలుడిని బయటకు తీశాక ఆసుపత్రికి తరలించామని, అతడి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది కలిసి బాలుడిని బయటకు తీశారని తెలిపారు. ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. బాలుడు బోరుబావిలో ఇరుక్కుపోయినప్పుడు అతడికి ఆక్సిజన్ పంపామని, అలాగే, నీరు, తినడానికి బిస్కెట్లను కూడా అందేలా చేశామని తెలిపారు. ఆ బాలుడితో మాట్లాడిస్తూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారని చెప్పారు.

Smartphones Bad For Kids : తల్లిదండ్రుల్లారా ఇకనైనా మేల్కోండి.. మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వొద్దు.. పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు..!