Vijay TVK Congress Alliance : బ్రేకింగ్ న్యూస్.. DMKకి భారీ షాక్.. టీవీకేకి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ..
Vijay TVK Congress Alliance : డీఎంకే పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
Breaking News Vijay Thalapathy TVK Alliance With Congress Official Press Note
TVK Congress Alliance : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ… తమిళనాడులోని రాజకీయ పరిణామాలు, ప్రజల అభిష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
పొత్తు గురించి టీవీకే, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్… టీవీకేకు మద్దతు ప్రకటించేందుకు అంగీకరించింది.
ఈ సందర్భంగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో ఇలా వివరించింది. తమిళనాడులో టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాము. రానున్న ఐదేళ్ల పాటు రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో టీవీకే పొత్తు ఉంటుంది. మతవాద శక్తులతో కలిసిపోనంత వరకు తమిళనాడులో టీవీకేకి తమ మద్దతు ఉంటుందని హస్తం పార్టీ లేఖలో పేర్కొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ.. డీఎంకేకు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఫలితాల తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటించడంతో డీఎంకే పార్టీతో.. కాంగ్రెస్ తెగదెంపులు చేసుకున్నట్లయింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన డీఎంకేకు ఇది పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
