బిఎస్ఎన్ఎల్ డేటాలో హాట్ స్టార్ ఉచితం

  • Published By: vamsi ,Published On : September 27, 2019 / 02:44 AM IST
బిఎస్ఎన్ఎల్ డేటాలో హాట్ స్టార్ ఉచితం

Updated On : September 27, 2019 / 2:44 AM IST

ఒకవైపు జియో తాకిడికి ప్రైవేట్ నెట్ ఆపరేటర్లే చేతులెత్తేస్తున్నారు. జియో ఆఫర్లు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో కూడా సాగుతుంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 పేరుతో ఆకర్షణీయమైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకుని రాబోతుంది. ఈ ప్లాన్లను డీఎస్ఎల్, భారత్ ఫైబర్ అనే రెండు కేటగిరీలుగా విభజించి కష్టమర్లకు అందించనుంది.

వీటితో పాటు కాంప్లిమెంటరీ ఆఫర్ కింద హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ ను కూడా కంపెనీ అందించనుంది. డీఎస్ఎల్ ప్లాన్ సబ్ స్ర్కైబర్స్ 10ఎంబీఎస్ వేగంతో, భారత్ ఫైబర్ సబ్ స్ర్కైబర్స్ 50 ఎంబీపీఎస్ వేగంతో 500 జీబీ డేటాను పొందనున్నారు. పూర్తిగా డేటాను వాడుకున్న తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 2ఎంబీపీఎస్ కు తగ్గుతుంది.

కాగా ఈప్లాన్ నెలవారీ ధర రూ.949. దీనితోపాటు నెలకు రూ.వెయ్యి విలువగల హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది బీఎస్ఎన్ఎల్. అదేవిధంగా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఇందులో ఉంది. ఈ ప్లాన్లు అండమాన్ నికోబార్ మినహా అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి రానుంది.